Thursday, May 26, 2016

Blood Donors

We are ready to help
For blood donate pls share to u r friends,collegus,relation etc.
1.Saffi O+ ,9176418321.
2.Mani O+ ,7401535415
3.Sriram B+ ,8056051072
4.Ramesh B+ , 9884727286
5.Suresh B+,  8148916988
6.Murali  A+. 7299399392
7.PRABHU. O+ 9884641396
8.Vijay. AB-ve. 9790954376
9.Jai. B-    99623610622
10.Raja A1+ 9789865312
11.Perumal O+
12.KALIDASS A+ 13.9943948951
14.Abbas A1- 9551414146
15.Rajalingam B+ 9626696882
Sundar O+ 9941418736
16.Yuvaraj AB+ 8124291412
17.jagir B+. ,9042670928
18.suresh Kumar O+. 9840939939
19.aravind O+, 9176980878.
20.Manikandan A+ 9566420317.
21.Senthilkumar B+,9962688252.
22.praveen kumar B +
9094314313
23.mohanraj B positive
      9444464789
24.manikandan O+
       9791097653
25.C.prathap O +ve  9940521093
26.Isaianand o+. 7845548466
27. S THILAK O+ ve , 861810723.  
28. Anbumani O+ (9566001676)
29.Syed A+  9551457239
30.M.jagadeesanvb A➕(7845662500)
31.Karthikeyan o+(9884400371)
32.Daniel
B+ (9003148805)
33.Sridhar o+ (9500119761)
34.V.Mohan 0+ (9940639557)                        35, jawahar b+ve 9600162581
36.v.karthick A1+ (9578828854)
37.C.Rajkumar B+ve
9790844373
38. Ashok Kumar B+
      9791142469
39.M.KARUKKUVEL Raj B positve -9087425095
40.NARENDRAN A1B+(9500148984)
41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)
43.siddiq O+. 9094666918
44.a.inba kumar o+ ve  9840301747
45.vignesh B+ 9884556995
46.vogneshgiri B+ 9043677660
47.anbarasan O+ 9840862846
48.M.Vimal kumar o+ 9677279760
49.Jeeva AB- (ph-8056292339)
50.sarath A+ 9551113240 
51.vazir o+(8754034986)
52.Dinesh A1+(8122288878)
53. Balakrish  O+ (9047904837)                          54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)
56. SHAKKUR B+ve +971552177084)frnds share this to as many groups as possible it may help a broken heart😊

Tuesday, April 26, 2016

నీటికోసం యుద్ధాలు

భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు తప్పవని నీటి లభ్యతపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్న ఒక పరిశోధకుడు ఆందోళన వెలిబుచ్చాడు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే గుక్కెడు నీళ్లకోసం ప్రజలు కాట్లాడకునే సంఘటనలు ఎంతో దూరంలో ఉండబోవని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశాడు. నిజమే...ఇదివరకు వేసవి కాలంలో నీటి కొరత సమస్య ఎదురయ్యేది. ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. పట్టణాలు, నగరాలు నీటికోసం విలవిలలాడుతున్నాయి. నీటి కొరతకు అసలు కారణం విచ్చలవిడిగా పెరుగుతున్న జనాభా పెరుగుల. వీటన్నికీ మించి నీరు వృధాకాకుండా చూడాల్సిన ప్రభుత్వాలే ఉదాశీనంగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు.ఉదాహరణకు దేశరాజధాని ఢిల్లీలో మంచి నీటి పంపులకు ఆయా ప్రదేశాలలో లీకేజీల వల్ల 40% నీరు వృధా పోతోందని ఆ రాష్ట్రంలోని ఒక స్వచ్చంద సంస్థ ఇటీవల తన నివేదికలో తెలిపింది. దేశ రాజధానిలోనే నీటి పొదుపు ఇలా ఉంటే.... ఇక మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి గురించి వేరే విడమరిచి చెప్పనక్కరలేదు.దీనితోపాటు ప్రజలలో నీటిని పొదుపుగా వాడే అలవాటు లేకపోవడం. ప్రభుత్వాలు ఓట్లకు నోట్లు పంచుతుంటాయి తప్ప ప్రాణాధారమైన ఇటువంటి వనరులను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పాపాన పోవడం లేదు.ఒకవైపు ప్రజలలో నీటి వినియోగం ఇలా ఉంటే... మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అసమానతలు చోటుచేసుకు వర్షాకాలం సైతం వేసవిని తలపిస్తోంది. గ్లోబల్ వార్మిగ్ ఫలితమే దీని వెనుక ఉన్న మూల కారణమని శాస్త్రజ్ఞులు చెవినిల్లు కట్టుకుని ఘోషిస్తున్నా పట్టించుకునేవారెవరు.ఇప్పటికే నగర ప్రజలు రోజువారీ 10 లీటర్ల నీటి బాటిళ్లను ఒక్కోటి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అంటే నీటికోసం నెలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. ఇక మధ్యతరగతి, పేద ప్రజల స్థితి వర్ణనాతీతం. కలుషిత నీళ్లను త్రాగుతూ వ్యాధులబారిన పడుతున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు ప్రజల ఆహారపు అలవాట్లలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరుగుతోంది. ఇది కూడా నీటిని హరించే అంశమే. ఎలాగంటే... మాంసాహారాన్ని తయారు చేసేందుకు అవసరమయ్యే నీరు శాకాహారానికంటే ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువ. ఇలా అన్నీ కలిసి నీటి కొరతలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి.ముందు తరాలకు నీటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రతి నీటి బొట్టును ప్రాణంతో సమానంగా చూసి ఖర్చు చేసినప్పుడే సాధ్యం. మరి నేటి నుంచే మొదలుపెడదామా... నీటి పొదుపును

నీటి సుస్థిరత కోసం ప్రణాళిక : ఏ విధంగా అన్నది నిరూపించిన నారాయణపూర్ మహిళలు

మనం ఇప్పుడు నారాయణ పూర్ కు చెందిన జోహద్ (వర్షపు నీరు సంరక్షించే ట్యాంకు) ఒడ్డున నిలబడి ఉన్నాం, ట్యాంకు నిండా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది . అది ఎండలు మండి పోతున్న ఏప్రిల్ నెలలోని ఒకరోజు, ఋతుపవనాలు వచ్చి వెళ్ళి పోయిన చాలా కాలం తరువాత చూస్తుంటే చిన్ననీటి నిల్వ కట్టడాలన్నీ నీరు లేక ఖాళీగా కనబడుతున్నాయి. అయితే జోహద్ మాత్రం నారాయణ పూర్ గ్రామస్తులకు సంవత్సరం పొడవునా మంచి తాగు నీరును అందించగలుగుతోంది. నారాయణపూర్ గ్రామం హర్యానా రాష్ట్రం లోని రెవారి జిల్లాలో ఉంది. అక్కడ సాధారణంగా భూగర్భజలాలు ఉప్పగా ఉండి తాగేందుకు పనికిరావు. అక్కడి నీటి నాణ్యతను వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పరీక్షించింది. రెవారి జిల్లా లో 24 శాతం బోరులలో మాత్రమే తాగేందుకు పనికి వస్తాయని, మిగిలినవి వివిధ రకాల శాతం ఉప్పుతో మరియు సోడియం తో నిండి ఉండడంతో నాణ్యత లేనట్టు ఆ పరీక్షల్లో తేల్చింది.

నారాయణ పూర్ మహిళలు చేతిల్లో నినాదాలు ధరించి ప్రదర్శించారు. నీటికుంటలు ఉంటేనే గ్రామం ఉంటుంది అనే అర్థంతో జోహద్ హై గావ్ హై అంటూ నినదిస్తూ వారు తమంతట తామే నారాయణ పూర్ లోని రిపేరు అయిన బోరు పంపులను మరింత పాడవకుండా బాగు చేసుకొనేందుకు నడుం బిగించారు. “సాధారణంగా ఒక చుక్క నీటి కోసం గంటలకొద్దీ వేచి ఉండే పరిస్థితి ఉండేది, వేసవిలో అయితే ఒక బిందె తియ్యని తాగు నీటికోసం రోజుల కొద్దీ వేచి ఉండే పరిస్థతి, దీనికోసం సుదీర్ఘంగా వేచి ఉండలేక తప్పని సరిగా బోరులోని లేదా బావిలోని ఉప్పనీటినే వాడుకునే వారం.” అన్నది లలిత తమ పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ....

తగినంతగా గ్రామంలో త్రాగునీరు లేక పోవడంతో ఈ గ్రామం పూర్తిగా బయటి నుండి వచ్చే నీటిపై ఆధారపడింది. మహిళలు నీటికోసం పడిగాపులు పడేవారు. కిరణ్ అనే అతను మరియు ఇంకో మహిళ ఈ గ్రామానికి వచ్చి నీటి సంరక్షణ అంశంపై పనిచేయాలనుకున్నప్పుడు వారి వెంట ఎవరూ లేరు. అందరూ నిరుత్సాహపరిచినా వారు కూలీలలాగానే పనిచేసి జోహద్ నీటి కుంట తవ్వకం మరియు మరమ్మత్తు పనులలో పనిచేశారు. ఆఖరికి ఆ గ్రామంలోని ఒక మహిళ కూడా వారితో జత కలిసింది. వారికి ఈ జోహద్ నీటిగుంట బాగుచేసే పని పూర్తి కావడానికి నిండా 5 నెలల సమయం పట్టింది.

హర్యానా రాష్ట్రంలోని రెవారి జిల్లాలోని నారాయణ పూర్ గ్రామంలో మొత్తం 225 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రాను రాను వర్షపాతం మరియు భూగర్భజలాలు రెండూ బాగా తగ్గిపోతున్నాయి. రెవారి జిల్లాలో ఎక్కువ మంది కేంద్ర భూగర్భజలాల అథారిటీ ద్వారా మరింత మోసానికి గురయ్యారని రూఢీగా చెప్పవచ్చు.

పెయుజాల్ అపూర్తి విభాగ్, హర్యానా అనే సంస్థ నారాయణ పూర్ గ్రామానికి ఇతర దగ్గరగా ఉన్న గ్రామమైన పునిష్క నుండి త్రాగునీరు సరఫరా చేసేవారు. అయితే 2007 లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల వల్ల పునిష్క గ్రామ ప్రజలు ఈ విధంగా తమ నీటిని నారాయణ పూర్ తో కలసి పంచుకోవడానికి వ్యతిరేకించారు. దీంతో కొన్ని సంవత్సరాలు నీటి సరఫరా విభాగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసింది. ఏదిఏమైనా నీటి సరఫరా క్రమంగా మరియు సరిపోయినంత ఎప్పుడూ వచ్చేది కాదు. కొన్ని కుటుంబాలు త్రాగు నీరు ను కొనడం మొదలు పెట్టారు. ఇలాంటి సందర్భంలో గ్రామంలోని కొంతమంది మహిళలు తమ గ్రామంలోని పాత నీటి కుంటలను పునరుద్దరించుకోవాలని తలంచారు. వీటిని వారు త్రాగు నీటికి ఓ ఆధారంగా 1990 కు ముందు పైపు ద్వారా నీటి సరఫరా లేక ముందు వాడేవారు. ఈ నీటి కుంట లేదా జోహద్ అప్పటినుండి వాడుకలో లేదు.

గ్రామ మహిళలు గ్రామీణ ప్రతిపాదనలు మరియు వాటి విస్తృతి అనే సామాజిక కేంద్రం (the Social Centre for Rural Initiative & Advancement SCRIA) వారిని కలిసి ఈ పథకానికి కావలసిన సలహాలు, సూచనలు మరియు ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనికి యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ వారు అంగీకరించి మహిళలు తమ వంతుగా కొంత గ్రామం నుండి నిధులు వసూలు చేయాలని తెలిపారు. ఆ విధంగా గ్రామస్తులు రూ.31,950 లు వసూలు కాగా. సంస్థ వారు అంగీక రించినట్టు వారు మిగిలిన మొత్తం వెచ్చించి జోహద్ ను పునరుద్దరించారు. మహిళలు తమంతట తాముగా ఇనుప వస్తువులు అమ్ముతున్న అంగళ్ళకు వెళ్ళి తమ పథక అవసరాన్ని, ఉద్దేశాన్ని వివరించి ధరను బాగా తక్కువగా బేరమాడి వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది. అంతేగాక వ్యయం లో కొంత శ్రమదానం రూపంగా చెల్లించడం జరిగింది. ఈ నీటి కుంట పునరుద్దరణ పథకానికి మొత్తం రూ.73,950 లు వ్యయం అయితే గ్రామ ప్రజల నుండి వసూలు చేసింది పోగా మిగిలినది యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ రూ.42,000 లు తమ వంతుగా అందించింది. ఈ కార్యక్రమం 2009 మార్చిలో పూర్తి చేశారు.

పాడయిపోయిన పాత నీటి కుంట స్థాయి నుండి మంచి తియ్యని త్రాగునీరు అందించే నీటి కుంటగా మారిన జోహద్ ప్రయాణం నల్లేరు పై నడకలా కాలేదు. తొలిరోజుల్లో గ్రామంలో ని కొంతమంది మహిళలు ప్రతిరోజూ తెల్లవారి జాముననే లేచి చందా వసూలుకు వెళ్ళేవారు. చందా వసూలుతో పాటు గ్రామ వ్యాపారుల తక్కువ ధరకే వస్తువుల ఇచ్చేలా బేరమాడేవారు. వీరిని చూసిన ఆ గ్రామంలోని మగవారు ఎగతాలి చేసి నవ్వుకునేవారు. మహిళలు నీటి కుంట పునరుద్దరణ కార్యక్రమంలో పూర్తి రోజు కూలీలుగా పనిచేయడం కూడా జరిగింది. వారి ధృఢ నిశ్చయం చూసిన తరువాత గ్రామంలోని మిగిలిన మహిళలు కూడా వారితో జత కలిశారు.

జోహద్ నీటి కుంట నుండి నీటిని రెండు గొట్టపు బావుల ద్వారా అందుతుంది. ఒక దానిలో నీరు ఉప్ప గా ఉంటుంది. ఈ నీటిని ఇళ్ళలోకే ప్రసుత్తం ఉన్న పైపులైన్ల ద్వారా సమీకృతం చేసుకొని పంపిణీ చేయడం జరిగింది. మంచి తియ్యని నీరు అందించే మరో గొట్టపు బావి నీటిని మాత్రం పైపులైన్ల ద్వారా పంపిణీ చేయడం లేదు. ప్రజలే గొట్టపు బావి వద్దకు వచ్చి తీసుకుపోయే పద్దతి పెట్టారు. ఒక కుటుంబం తమ త్రాగు నీరు మరియు వంట కోసం రెండు నుంచి మూడు బిందెల నీటిని మాత్రం తీసుకునే వీలు కల్పించారు.

ఈ గ్రామ సర్పంచ్ అనిత వివరిస్తూ.. . త్రాగేనీటి ఆధారం, నిర్వహణ మరియు సుస్థిరంగా అందించడం కోసం ఈ పద్దతిని ఉద్దేశ పూర్వకంగానే అమలు చేసినట్టు తెలిపింది. గ్రామంలో ని అందరు మహిళలు నీటి బావి దగ్గర ఒక నిర్ణీత సమయంలో సమావేశం అవుతారు. ఎవరు ఎక్కువ నీటిని తీసుకు వెళ్ళరు . అంతేకాకుండా తలపై నీటిని మోసుకుంటూ 800 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట నుండి నీరు తీసుకు వెళ్లవలసి ఉంటుంది. రెండు లేదా మూడు బిందెలకు మించి నీరు తీసుకెళ్ళడమనేది అంత సులభమైనది కాదు. ఈ నిర్ణయం గ్రామానికి చెందిన మహిళలే తీసుకొన్నారు. రెండేళ్ళు పైబడిన తరువాత ఇంకా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండడం విశేషం. గ్రామంలోని ఓ వృద్ధ మహిళ మాట్లాడుతూ “ తీయని త్రాగు నీరు తమ గ్రామంలో లభించడం భగవంతుడి కృప. దీనిని దేవాలయంలో దీనిని మేము గౌరవిస్తాము” అన్నది.

ఈ నీటి కుంట సంవత్సరం పొడవునా గ్రామస్తులకు కావలసిన అన్ని అవసరాలకు నీటిని అందిస్తున్నది. గ్రామస్తులు ఈ నీటికుంటకు సమీపంలోని పాఠశాల ఆవరణలో మరో వర్షపు నీటిని సంరక్షించే మరో నీటికుంట నిర్మాణానికి ఉపక్రమించారు. పాఠశాల పైకప్పునుండి పడే నీరు ఈ కుంటలోకి సేకరించడం వల్ల భూగర్బంలోకి నీరు స్వచ్చతగా వడగట్టి వెళ్లుతుంది. నీటి మట్టం మరింత పెరుగుతుంది. ఈ వర్షపు నీరు సేకరించే కుంట జోహద్ కు దగ్గరగా ఉండడంతో నీటి నిల్వస్థాయి తగ్గకుండా ఉంటుంది. ఈ గ్రామంలో నీటిని ఎక్కువగా వినియోగించే పంటలు ఉదా.. వరి లాంటి పంటలు వేయకూడదని తీర్మానించుకున్నారు.

ఈ గ్రామం పరిసర గ్రామాలకు ఆదర్శగ్రామంగా మారింది. నిదానంగానైనా చుట్టుప్రక్కల గ్రామాలలోనూ ఈ విధంగా మార్పువస్తున్నట్టు మనం గుర్తించవచ్చు.

వాననీటి సంరక్షణ మరియు భూగర్భజలాల రీఛార్జిద్వారా తాగునీటి భద్రత

మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని దాతియా పంచాయతీ సమితిలోని హమీర్ పూర్ అనే గ్రామంలో జనాభా సంఖ్య 641. వీరిలో ఎక్కువమంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం అస్తవ్యస్త వర్షపాతం కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని, కరవు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏడాదికి 100రోజులు(సగటున 740 మి.మి.) కనీసం వర్షాలు పడుతుండగా, ఇప్పుడు సంవత్సరానికి కేవలం 40రోజులు(340మి.మి.) మాత్రమే వర్షాలు పడుతున్నాయి.

స్థానికుల ప్రయత్నాలు

స్వజలధార కార్యక్రమం కింద గ్రామంలో తాగునీటి సరఫరా పథకం చేపట్టడానికి గ్రామము నీరు మరియు పారిశుధ్యసంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దీనినే పేజల్ సమితి అనికూడా పిలుచుకుంటారు. ఈ పథకానికి గ్రామస్తులు తమ వంతుగా రు.40,000 సేకరించారు. అయితే పథకానికి అవసరమైన అనుమతులు సాధించలేకపోయారు. రోజులో ఎక్కువకాలం దూరప్రాంతాలనుంచి తాగునీటిని తెచ్చుకోవడానికే సరిపోతుండటంతో...ఒక వ్యవస్థీకృత తాగునీటి సరఫరా పథకం లేకుండా గ్రామంలో ఆర్ధికాభివృద్ధి వీలుకాదని గ్రామస్తులకు అర్ధమయింది.

కొత్త ఆలోచన

కొన్ని అంతర్గత సమావేశాల తర్వాత గ్రామస్తులు...ఇక తామే పూనుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో భూగర్భజలాల స్థాయిని మెరుగుపరచడానికి, సమీప భవిష్యత్తులో నీటి సరఫరా పథకాన్ని విజయవంతంగా అమలుచేయడానికి ‘సమగ్ర నీటివనరుల నిర్వహణ’ను చేపట్టారు. వాననీటి సంరక్షణకు, రీఛార్జికి అన్ని ఇళ్ళలో వాననీటిసంరక్షణ గుంటలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. పాడుబడిన ఊరబావుల్లో పూడికతీయడం, రీఛార్జిచేయడం, చెక్ డ్యాములు నిర్మించడం మొదలైనవి ఆ ప్రణాళికలో భాగం.

పాడుబడిన చేతిపంపు మరియు ఊరబావులను రీఛార్జి చేయుట

ఇళ్ళ నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి కావలసిన మట్టికోసం గ్రామం బయట గొయ్యి తవ్వడానికి ఒక స్థలాన్ని గుర్తించారు. చేతిపంపులు, భూగర్భజలాల రీఛార్జికోసం ఆ గొయ్యిని వాడాలని నిర్ణయించారు. ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖవారు గ్రామంలో ఒక చిన్న కందకంలాంటి ఆనకట్టను, ఇతర గ్రామాలలోని కాలువలపైన చెక్ డ్యాములను నిర్మించారు. దీనితో చెక్ డ్యాముకు పైనున్న చేతిపంపులన్నీ రీఛార్జి అయినాయి. వాననీటి సంరక్షణకోసం ఊరిలోని ఇళ్ళకప్పులమీద కొన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 ఇళ్ళలోనూ, పాఠశాలలోనూ, అంగన్ వాడీలోనూ ఇంటి కప్పులమీద పడే వాననీరు, కింద ఇసుక, కంకరరాళ్ళతో కూడిన గుంటల్లో పడేటట్లుగా పైపులు అమర్చారు. పర్హిత్ అనే ఒక స్వచ్చంద సేవాసంస్థ ఇంటికి రు.500చొప్పున ఇచ్చింది...మిగిలిన మొత్తం...రు.1000నుంచి రు.1200 లను లబ్దిదారులు సమకూర్చారు.

ఇళ్ళన్నిటికీ కనీస సురక్షిత తాగునీరు అందాలన్న హమీర్ పూర్ గ్రామస్తుల ప్రయత్నంతో...సమృద్ధిగా తాగునీరు అందుబాటులోకి వచ్చింది. సమగ్ర నీటి వనరుల నిర్వహణ పథకాన్ని చేపట్టడం, వాననీటి సంరక్షణకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం వలన ఇది సాధ్యమయింది. ఈ వినూత్న ప్రయోగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది.

Monday, April 25, 2016

ఇంకుడుగుంతలు

గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనె లభ్యమయ్యేవి. వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రాను రాను క్రిందికి పోతున్నది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. వెయ్యి అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. 300-400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పర్యావరం లో మార్పులు చాల త్వరగా వచ్చే అవకాశమున్నది. ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా విన్నది. ఈ కార్య క్రమాన్ని వ్వక్తి గతంగానే కాకుండా సామాజిక పరంగా కూడ బారి ఎత్తున చేపట్ట గలిగితే సరైన ప్రతి ఫలము పొంద గలరు.

ఇంకుడు గుంతలను నిర్మించడం ఎలా?

ప్రధానంగా బోరు బావులు, సమీపంలో ఈ ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కూడ సంకల్పించింది. ప్రతి బోరు బావి వద్ద సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి. ఆ గుంతలో పావు భాగము పెద్ద బెండడ రాళ్ళతో నింపాలి, ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర తో నింపాలి. గుంత లోపల కొంత భాగం ఖాళీగా వుంచి పైన మూత ఏర్పాటు చేయాలి. ఆ చుట్టు ప్రక్కల పడిన వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతల్లోకి చేరు విధంగా కాలువ/ పైపుల ద్వారా వచ్చే ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంతలు నేల స్వభావాన్ని బట్టి, పరిశరాలను బట్టి నీటి లభ్యతను బట్టి గుంతల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో చాల పెద్ద ఇంకుడు గుంతలు నిర్మించ వచ్చు. పొలాల్లో చాల పెద్ద ఇంకుడు గుంతలు నిర్మించ వచ్చు. ఇలాంటి పెద్ద గుంతలకు పైన కప్పు అవసరముండదు.

ఉపయోగములు:

వర్షపునీరు, వృథానీటిని వృధాకా పోనీయ కుండ ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడుగుంతలలోనికి చేర్చ గలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆరుబయట, ఇళ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టు పక్కల ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. ఏటేటా తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇంకుడుగుంతలే శరణ్యం. వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వీటిని నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెంపొందించుకోవచ్చు. ఇంకుడు గుంతలు నిర్మించి నందున ఆ చుట్టు ప్రక్కల పడిన వృధాగా పోయే వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూగర్భ జల మట్టము పెరిగి ఇదివరకు ఎండిపోయిన గొట్టపు బావులు తిరిగి జలసిరితో నిండిన సందర్బాలు అనేకం వున్నాయి.

ఇంకుడు గుంతలు ఎక్కడ నిర్మించాలి?

ఇంకుడు గుంతలు పలాని చోట నిర్మించాలని ఏమి లేదు తమకు అనుకూలమైన ప్రతి చోట వాటిని నిర్మించుకోవచ్చు.

ఇళ్ళలోముఖ్యంగా నగరాలలో .... అంతటా కాంక్రీటు మయం అయినందున.... ఇళ్ళు, రోడ్లు, మొదలగు వన్నీ కాంక్రీటు మయం. కనుకు వర్షపు నీరు భూమిలోనికి ఇంకే అవకాశమేలేదు. కనుక నగరంలోని ప్రతి గృహస్థుడు తన ఇంటి ఆవరణంలో ఇంకుడు గుంతలను నిర్మించి తమ ఇంటి డాబా మీద పడిన వర్షపు నీటిని ఈ ఇంకుడు గుంతలలోనికి వెళ్ళేటట్లు మార్గాలను ఏర్పరచాలి. ఇంటి ఆవరణంలో బోరు బావి వుంటే దానికి అతి దగ్గరగా ఈ గుంటను ఏర్పాతు చేస్తే బోరు బావి ఎన్నటికి ఎండదు.పార్కులలోపార్కులు, ఇతర ఇతర విశాలమైన ఆవరణముగల ప్రదేశాలలో ఒక మూలగా పెద్ద ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలి, ఆ ప్రదేశంలో పడిని వర్షపు నీటిని ఆ గుంతల్లోకి ప్రవహించే ఏర్పాటు చేసుకోవాలి.రోడ్ల ప్రక్కనరోడ్ల ప్రక్కన కూడ పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవచ్చు.పొలాల్లోపలలెల్లోని పొలాలలో పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. అందులో చేరిన నీటిని వర్షాకాలమంతా ఇతర వ్యవసాయ పనులకు వాడుకోవచ్చు. అంతే గాగ ఆ గుంత లోనీరు ఇంకి భూగర్భ జల మట్టము పెరిగు తుంది.

సర్వేజనా సుఖినోభవంతు

బ్రహ్మ శ్రీ సింహరాజు శ్రీనివాస్ విశ్వకర్మ

Friday, April 22, 2016

INDIAN GOVT ONLINE SERVICES

🔴1.  Birth Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=1

🔴2.  Caste Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=4

🔴3.  Tribe Certificate
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8

🔴4.  Domicile Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=5

🔴5.  Driving Licence
http://www.india.gov.in/howdo/howdoi.php?service=6

🔴6.  Marriage Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=3

🔴7.  Death Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=2

Apply for:
🔴1.    PAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15

🔴2.     TAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3

🔴3.     Ration Card
http://www.india.gov.in/howdo/howdoi.php?service=7

🔴4.     Passport
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2

🔴5.     Inclusion of name in the Electoral Rolls
http://www.india.gov.in/howdo/howdoi.php?service=10

Register:  
🔴1.    Land/Property
http://www.india.gov.in/howdo/howdoi.php?service=9

🔴2.    Vehicle
http://www.india.gov.in/howdo/howdoi.php?service=13

🔴3.    With State Employment Exchange
http://www.india.gov.in/howdo/howdoi.php?service=12

🔴4.    As Employer
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17

🔴5.    Company
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19

🔴6.    .IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18

🔴7.    GOV.IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25

Check/Track:
🔴1.    Waiting list status for Central Government Housing
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9

🔴2.     Status of Stolen Vehicles
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1

🔴3.    Land Records
http://www.india.gov.in/landrecords/index.php

🔴4.    Cause list of Indian Courts
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7

🔴5.    Court Judgments (JUDIS )
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24

🔴6.    Daily Court Orders/Case Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21

🔴7.    Acts of Indian Parliament
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13

🔴8.    Exam Results
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16

🔴9.    Speed Post Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10

🔴10. Agricultural Market Prices Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6

Book/File/Lodge:
🔴1.     Train Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5

🔴2.     Air Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4

🔴3.     Income Tax Returns
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12

🔴4.     Complaint with Central Vigilance Commission (CVC)
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14

Contribute to:
🔴1.      Prime Minister's Relief Fund
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11

Others:
🔴1.      Send Letters Electronically
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20

Global Navigation  
🔴1.     Citizens
http://www.india.gov.in/citizen.php

🔴2.     Business (External website that opens in a new window)
http://business.gov.in/

🔴3.     Overseas
http://www.india.gov.in/overseas.php

🔴4.     Government
http://www.india.gov.in/govtphp

🔴5.     Know India
http://www.india.gov.in/knowindia.php

🔴6.     Sectors
http://www.india.gov.in/sector.php

🔴7.     Directories
http://www.india.gov.in/directories.php

🔴8.     Documents
http://www.india.gov.in/documents.php

🔴9.     Forms
http://www.india.gov.in/forms/forms.php

🔴10.    Acts
http://www.india.gov.in/govt/acts.php

🔴11.  Rules
http://www.india.gov.in/govt/rules.php

Friday, April 15, 2016

చదివితే ఇవి పదాలు, ఆచరిస్తే అస్త్రాలు.

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.