Tuesday, April 26, 2016

నీటి సుస్థిరత కోసం ప్రణాళిక : ఏ విధంగా అన్నది నిరూపించిన నారాయణపూర్ మహిళలు

మనం ఇప్పుడు నారాయణ పూర్ కు చెందిన జోహద్ (వర్షపు నీరు సంరక్షించే ట్యాంకు) ఒడ్డున నిలబడి ఉన్నాం, ట్యాంకు నిండా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది . అది ఎండలు మండి పోతున్న ఏప్రిల్ నెలలోని ఒకరోజు, ఋతుపవనాలు వచ్చి వెళ్ళి పోయిన చాలా కాలం తరువాత చూస్తుంటే చిన్ననీటి నిల్వ కట్టడాలన్నీ నీరు లేక ఖాళీగా కనబడుతున్నాయి. అయితే జోహద్ మాత్రం నారాయణ పూర్ గ్రామస్తులకు సంవత్సరం పొడవునా మంచి తాగు నీరును అందించగలుగుతోంది. నారాయణపూర్ గ్రామం హర్యానా రాష్ట్రం లోని రెవారి జిల్లాలో ఉంది. అక్కడ సాధారణంగా భూగర్భజలాలు ఉప్పగా ఉండి తాగేందుకు పనికిరావు. అక్కడి నీటి నాణ్యతను వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పరీక్షించింది. రెవారి జిల్లా లో 24 శాతం బోరులలో మాత్రమే తాగేందుకు పనికి వస్తాయని, మిగిలినవి వివిధ రకాల శాతం ఉప్పుతో మరియు సోడియం తో నిండి ఉండడంతో నాణ్యత లేనట్టు ఆ పరీక్షల్లో తేల్చింది.

నారాయణ పూర్ మహిళలు చేతిల్లో నినాదాలు ధరించి ప్రదర్శించారు. నీటికుంటలు ఉంటేనే గ్రామం ఉంటుంది అనే అర్థంతో జోహద్ హై గావ్ హై అంటూ నినదిస్తూ వారు తమంతట తామే నారాయణ పూర్ లోని రిపేరు అయిన బోరు పంపులను మరింత పాడవకుండా బాగు చేసుకొనేందుకు నడుం బిగించారు. “సాధారణంగా ఒక చుక్క నీటి కోసం గంటలకొద్దీ వేచి ఉండే పరిస్థితి ఉండేది, వేసవిలో అయితే ఒక బిందె తియ్యని తాగు నీటికోసం రోజుల కొద్దీ వేచి ఉండే పరిస్థతి, దీనికోసం సుదీర్ఘంగా వేచి ఉండలేక తప్పని సరిగా బోరులోని లేదా బావిలోని ఉప్పనీటినే వాడుకునే వారం.” అన్నది లలిత తమ పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ....

తగినంతగా గ్రామంలో త్రాగునీరు లేక పోవడంతో ఈ గ్రామం పూర్తిగా బయటి నుండి వచ్చే నీటిపై ఆధారపడింది. మహిళలు నీటికోసం పడిగాపులు పడేవారు. కిరణ్ అనే అతను మరియు ఇంకో మహిళ ఈ గ్రామానికి వచ్చి నీటి సంరక్షణ అంశంపై పనిచేయాలనుకున్నప్పుడు వారి వెంట ఎవరూ లేరు. అందరూ నిరుత్సాహపరిచినా వారు కూలీలలాగానే పనిచేసి జోహద్ నీటి కుంట తవ్వకం మరియు మరమ్మత్తు పనులలో పనిచేశారు. ఆఖరికి ఆ గ్రామంలోని ఒక మహిళ కూడా వారితో జత కలిసింది. వారికి ఈ జోహద్ నీటిగుంట బాగుచేసే పని పూర్తి కావడానికి నిండా 5 నెలల సమయం పట్టింది.

హర్యానా రాష్ట్రంలోని రెవారి జిల్లాలోని నారాయణ పూర్ గ్రామంలో మొత్తం 225 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రాను రాను వర్షపాతం మరియు భూగర్భజలాలు రెండూ బాగా తగ్గిపోతున్నాయి. రెవారి జిల్లాలో ఎక్కువ మంది కేంద్ర భూగర్భజలాల అథారిటీ ద్వారా మరింత మోసానికి గురయ్యారని రూఢీగా చెప్పవచ్చు.

పెయుజాల్ అపూర్తి విభాగ్, హర్యానా అనే సంస్థ నారాయణ పూర్ గ్రామానికి ఇతర దగ్గరగా ఉన్న గ్రామమైన పునిష్క నుండి త్రాగునీరు సరఫరా చేసేవారు. అయితే 2007 లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల వల్ల పునిష్క గ్రామ ప్రజలు ఈ విధంగా తమ నీటిని నారాయణ పూర్ తో కలసి పంచుకోవడానికి వ్యతిరేకించారు. దీంతో కొన్ని సంవత్సరాలు నీటి సరఫరా విభాగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసింది. ఏదిఏమైనా నీటి సరఫరా క్రమంగా మరియు సరిపోయినంత ఎప్పుడూ వచ్చేది కాదు. కొన్ని కుటుంబాలు త్రాగు నీరు ను కొనడం మొదలు పెట్టారు. ఇలాంటి సందర్భంలో గ్రామంలోని కొంతమంది మహిళలు తమ గ్రామంలోని పాత నీటి కుంటలను పునరుద్దరించుకోవాలని తలంచారు. వీటిని వారు త్రాగు నీటికి ఓ ఆధారంగా 1990 కు ముందు పైపు ద్వారా నీటి సరఫరా లేక ముందు వాడేవారు. ఈ నీటి కుంట లేదా జోహద్ అప్పటినుండి వాడుకలో లేదు.

గ్రామ మహిళలు గ్రామీణ ప్రతిపాదనలు మరియు వాటి విస్తృతి అనే సామాజిక కేంద్రం (the Social Centre for Rural Initiative & Advancement SCRIA) వారిని కలిసి ఈ పథకానికి కావలసిన సలహాలు, సూచనలు మరియు ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనికి యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ వారు అంగీకరించి మహిళలు తమ వంతుగా కొంత గ్రామం నుండి నిధులు వసూలు చేయాలని తెలిపారు. ఆ విధంగా గ్రామస్తులు రూ.31,950 లు వసూలు కాగా. సంస్థ వారు అంగీక రించినట్టు వారు మిగిలిన మొత్తం వెచ్చించి జోహద్ ను పునరుద్దరించారు. మహిళలు తమంతట తాముగా ఇనుప వస్తువులు అమ్ముతున్న అంగళ్ళకు వెళ్ళి తమ పథక అవసరాన్ని, ఉద్దేశాన్ని వివరించి ధరను బాగా తక్కువగా బేరమాడి వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది. అంతేగాక వ్యయం లో కొంత శ్రమదానం రూపంగా చెల్లించడం జరిగింది. ఈ నీటి కుంట పునరుద్దరణ పథకానికి మొత్తం రూ.73,950 లు వ్యయం అయితే గ్రామ ప్రజల నుండి వసూలు చేసింది పోగా మిగిలినది యస్.సి.ఆర్.ఐ.ఏ సంస్థ రూ.42,000 లు తమ వంతుగా అందించింది. ఈ కార్యక్రమం 2009 మార్చిలో పూర్తి చేశారు.

పాడయిపోయిన పాత నీటి కుంట స్థాయి నుండి మంచి తియ్యని త్రాగునీరు అందించే నీటి కుంటగా మారిన జోహద్ ప్రయాణం నల్లేరు పై నడకలా కాలేదు. తొలిరోజుల్లో గ్రామంలో ని కొంతమంది మహిళలు ప్రతిరోజూ తెల్లవారి జాముననే లేచి చందా వసూలుకు వెళ్ళేవారు. చందా వసూలుతో పాటు గ్రామ వ్యాపారుల తక్కువ ధరకే వస్తువుల ఇచ్చేలా బేరమాడేవారు. వీరిని చూసిన ఆ గ్రామంలోని మగవారు ఎగతాలి చేసి నవ్వుకునేవారు. మహిళలు నీటి కుంట పునరుద్దరణ కార్యక్రమంలో పూర్తి రోజు కూలీలుగా పనిచేయడం కూడా జరిగింది. వారి ధృఢ నిశ్చయం చూసిన తరువాత గ్రామంలోని మిగిలిన మహిళలు కూడా వారితో జత కలిశారు.

జోహద్ నీటి కుంట నుండి నీటిని రెండు గొట్టపు బావుల ద్వారా అందుతుంది. ఒక దానిలో నీరు ఉప్ప గా ఉంటుంది. ఈ నీటిని ఇళ్ళలోకే ప్రసుత్తం ఉన్న పైపులైన్ల ద్వారా సమీకృతం చేసుకొని పంపిణీ చేయడం జరిగింది. మంచి తియ్యని నీరు అందించే మరో గొట్టపు బావి నీటిని మాత్రం పైపులైన్ల ద్వారా పంపిణీ చేయడం లేదు. ప్రజలే గొట్టపు బావి వద్దకు వచ్చి తీసుకుపోయే పద్దతి పెట్టారు. ఒక కుటుంబం తమ త్రాగు నీరు మరియు వంట కోసం రెండు నుంచి మూడు బిందెల నీటిని మాత్రం తీసుకునే వీలు కల్పించారు.

ఈ గ్రామ సర్పంచ్ అనిత వివరిస్తూ.. . త్రాగేనీటి ఆధారం, నిర్వహణ మరియు సుస్థిరంగా అందించడం కోసం ఈ పద్దతిని ఉద్దేశ పూర్వకంగానే అమలు చేసినట్టు తెలిపింది. గ్రామంలో ని అందరు మహిళలు నీటి బావి దగ్గర ఒక నిర్ణీత సమయంలో సమావేశం అవుతారు. ఎవరు ఎక్కువ నీటిని తీసుకు వెళ్ళరు . అంతేకాకుండా తలపై నీటిని మోసుకుంటూ 800 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట నుండి నీరు తీసుకు వెళ్లవలసి ఉంటుంది. రెండు లేదా మూడు బిందెలకు మించి నీరు తీసుకెళ్ళడమనేది అంత సులభమైనది కాదు. ఈ నిర్ణయం గ్రామానికి చెందిన మహిళలే తీసుకొన్నారు. రెండేళ్ళు పైబడిన తరువాత ఇంకా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండడం విశేషం. గ్రామంలోని ఓ వృద్ధ మహిళ మాట్లాడుతూ “ తీయని త్రాగు నీరు తమ గ్రామంలో లభించడం భగవంతుడి కృప. దీనిని దేవాలయంలో దీనిని మేము గౌరవిస్తాము” అన్నది.

ఈ నీటి కుంట సంవత్సరం పొడవునా గ్రామస్తులకు కావలసిన అన్ని అవసరాలకు నీటిని అందిస్తున్నది. గ్రామస్తులు ఈ నీటికుంటకు సమీపంలోని పాఠశాల ఆవరణలో మరో వర్షపు నీటిని సంరక్షించే మరో నీటికుంట నిర్మాణానికి ఉపక్రమించారు. పాఠశాల పైకప్పునుండి పడే నీరు ఈ కుంటలోకి సేకరించడం వల్ల భూగర్బంలోకి నీరు స్వచ్చతగా వడగట్టి వెళ్లుతుంది. నీటి మట్టం మరింత పెరుగుతుంది. ఈ వర్షపు నీరు సేకరించే కుంట జోహద్ కు దగ్గరగా ఉండడంతో నీటి నిల్వస్థాయి తగ్గకుండా ఉంటుంది. ఈ గ్రామంలో నీటిని ఎక్కువగా వినియోగించే పంటలు ఉదా.. వరి లాంటి పంటలు వేయకూడదని తీర్మానించుకున్నారు.

ఈ గ్రామం పరిసర గ్రామాలకు ఆదర్శగ్రామంగా మారింది. నిదానంగానైనా చుట్టుప్రక్కల గ్రామాలలోనూ ఈ విధంగా మార్పువస్తున్నట్టు మనం గుర్తించవచ్చు.

No comments:

Post a Comment