Tuesday, April 26, 2016

వాననీటి సంరక్షణ మరియు భూగర్భజలాల రీఛార్జిద్వారా తాగునీటి భద్రత

మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలోని దాతియా పంచాయతీ సమితిలోని హమీర్ పూర్ అనే గ్రామంలో జనాభా సంఖ్య 641. వీరిలో ఎక్కువమంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం అస్తవ్యస్త వర్షపాతం కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని, కరవు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏడాదికి 100రోజులు(సగటున 740 మి.మి.) కనీసం వర్షాలు పడుతుండగా, ఇప్పుడు సంవత్సరానికి కేవలం 40రోజులు(340మి.మి.) మాత్రమే వర్షాలు పడుతున్నాయి.

స్థానికుల ప్రయత్నాలు

స్వజలధార కార్యక్రమం కింద గ్రామంలో తాగునీటి సరఫరా పథకం చేపట్టడానికి గ్రామము నీరు మరియు పారిశుధ్యసంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దీనినే పేజల్ సమితి అనికూడా పిలుచుకుంటారు. ఈ పథకానికి గ్రామస్తులు తమ వంతుగా రు.40,000 సేకరించారు. అయితే పథకానికి అవసరమైన అనుమతులు సాధించలేకపోయారు. రోజులో ఎక్కువకాలం దూరప్రాంతాలనుంచి తాగునీటిని తెచ్చుకోవడానికే సరిపోతుండటంతో...ఒక వ్యవస్థీకృత తాగునీటి సరఫరా పథకం లేకుండా గ్రామంలో ఆర్ధికాభివృద్ధి వీలుకాదని గ్రామస్తులకు అర్ధమయింది.

కొత్త ఆలోచన

కొన్ని అంతర్గత సమావేశాల తర్వాత గ్రామస్తులు...ఇక తామే పూనుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో భూగర్భజలాల స్థాయిని మెరుగుపరచడానికి, సమీప భవిష్యత్తులో నీటి సరఫరా పథకాన్ని విజయవంతంగా అమలుచేయడానికి ‘సమగ్ర నీటివనరుల నిర్వహణ’ను చేపట్టారు. వాననీటి సంరక్షణకు, రీఛార్జికి అన్ని ఇళ్ళలో వాననీటిసంరక్షణ గుంటలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. పాడుబడిన ఊరబావుల్లో పూడికతీయడం, రీఛార్జిచేయడం, చెక్ డ్యాములు నిర్మించడం మొదలైనవి ఆ ప్రణాళికలో భాగం.

పాడుబడిన చేతిపంపు మరియు ఊరబావులను రీఛార్జి చేయుట

ఇళ్ళ నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి కావలసిన మట్టికోసం గ్రామం బయట గొయ్యి తవ్వడానికి ఒక స్థలాన్ని గుర్తించారు. చేతిపంపులు, భూగర్భజలాల రీఛార్జికోసం ఆ గొయ్యిని వాడాలని నిర్ణయించారు. ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖవారు గ్రామంలో ఒక చిన్న కందకంలాంటి ఆనకట్టను, ఇతర గ్రామాలలోని కాలువలపైన చెక్ డ్యాములను నిర్మించారు. దీనితో చెక్ డ్యాముకు పైనున్న చేతిపంపులన్నీ రీఛార్జి అయినాయి. వాననీటి సంరక్షణకోసం ఊరిలోని ఇళ్ళకప్పులమీద కొన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 ఇళ్ళలోనూ, పాఠశాలలోనూ, అంగన్ వాడీలోనూ ఇంటి కప్పులమీద పడే వాననీరు, కింద ఇసుక, కంకరరాళ్ళతో కూడిన గుంటల్లో పడేటట్లుగా పైపులు అమర్చారు. పర్హిత్ అనే ఒక స్వచ్చంద సేవాసంస్థ ఇంటికి రు.500చొప్పున ఇచ్చింది...మిగిలిన మొత్తం...రు.1000నుంచి రు.1200 లను లబ్దిదారులు సమకూర్చారు.

ఇళ్ళన్నిటికీ కనీస సురక్షిత తాగునీరు అందాలన్న హమీర్ పూర్ గ్రామస్తుల ప్రయత్నంతో...సమృద్ధిగా తాగునీరు అందుబాటులోకి వచ్చింది. సమగ్ర నీటి వనరుల నిర్వహణ పథకాన్ని చేపట్టడం, వాననీటి సంరక్షణకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం వలన ఇది సాధ్యమయింది. ఈ వినూత్న ప్రయోగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది.

No comments:

Post a Comment